Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కేఎం ఖండన
- లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు
- రైతులను అవమానించిన హర్యానా సీఎం ఖట్టర్
- యూపీలో రైతు నేతలకు బెదిరింపులు
- నేడు హర్యానాలో వామపక్షలు నిరసనలు
న్యూఢిల్లీ : రైతులపై హర్యానా పోలీసులు కేసులు నమోదుచేయటంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కర్నాల్ పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా జాతీయ రహదారి దిగ్బంధించిన గుర్నామ్ సింగ్ చారుణి, ఇతర రైతులపై అంబాలాలోని షాజాద్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడాన్ని ఎస్కేఎం ఖండించింది. నేషనల్ హైవే యాక్ట్, ఐపీసీ 109,265,283కింద నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేసింది.మరోవైపు బీజేపీ నాయకులకు వ్యతిరేకం గా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటు న్నారు.ఉత్తరప్రదేశ్‌లో ఖతౌలి నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ మీరాపూర్ దల్పత్‌కు చేరుకున్నప్పుడు నల్ల జెండాలతో రైతులు నిరసన తెలిపారు. పంజాబ్‌లోని ఫాజిల్కాలో బీజేపీకి చెందిన సుర్జిత్ కుమార్ జ్యానికి రైతుల నిరసన సెగ తాకింది.
లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు
హర్యానాలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వ పోలీసుల క్రూరత్వాన్ని హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లోనూ రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రాల్లోన్ని వివిధ ప్రదేశాల్లో రైతులు రహదారులను దిగ్బంధించారు. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి సుదూర రాష్ట్రాల్లో కూడా రైతు ఆందోళనలు ప్రతిధ్వనించాయి. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హర్యానా ప్రభుత్వం క్రూరమైన రైతు వ్యతిరేక అణచివేతకు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించారు.
బెదిరింపులు
సెప్టెంబర్ 5న ముజఫర్‌నగర్ కిసాన్ మహా పంచాయత్‌లో పాల్గొనడానికి గ్రామస్తులు ఉత్సాహంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో అనేక సమావేశాలు జరుగుతున్నాయి. మంగళవారం హత్రాస్ జిల్లాలోని సదాబాద్లో వేలాది మంది రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో రైతు నాయకులను బెదిరించడం, వేధించడం ప్రారంభించారు. అలీగఢ్‌లో ఓ రైతు నాయకుడిపై దాడికి సైతం ప్రయత్నించారు. భయపెట్టే వ్యూహాలను విరమించుకోవాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఎస్కేఎం హెచ్చరించిం ది.రైతులపై లాఠీఛార్జ్‌ని నిరసనగా హర్యానాలోని నాలుగు వామపక్ష పార్టీలు నిరసనలకు పిలుపు ఇచ్చాయి. మంగళవారం సమావేశం అయిన ఆయా పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.