Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలువుతీరిన తొమ్మిది మంది జడ్జిలు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన తొమ్మిదిమంది ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు అదనపు బల్డింగ్ కాంప్లెక్స్‌లో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం గమనార్హం. దీంతో ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీతో కలిపి మహిళా జడ్జిల సంఖ్య నాలుగుకు చేరింది. సుప్రీంకోర్టు చరిత్రలో నలుగురు సిట్టింగ్ మహిళా న్యాయమూర్తులు ఉండటమూ ఇదే తొలిసారి.
న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం వరుసగా....
జస్టిస్ అభరు శ్రీనివాస్ ఓకా : కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. ఆయన పేరెంట్ హైకోర్టు బాంబేహైకోర్టు. సుప్రీం కోర్టులో 2025 మే 25 వరకూ సేవలు అందించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ప్రధాన ధర్మాసనంలో కూర్చొన్నారు.
జస్టిస్ విక్రమ్‌నాథ్ : గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయయూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. పేరెంట్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. ప్రమాణ స్వీకారం అనంతరం రెండో కోర్టులో జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అజరు రస్తోగిలతో కూడిన ధర్మాసనంలో కూర్చొన్నారు.
జస్టిస్ జెకె మహేశ్వరి : సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. గతంలో ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. పేరెంట్ హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు. సుప్రీంకోర్టులో 2026 జూన్ 29 వరకూ సేవలందించనున్నారు. జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన మూడో ధర్మాసనంలో కూర్చొన్నారు.
జస్టిస్ హిమ కోహ్లి : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. పేరెంట్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు. 2024 సెప్టెంబరు 2 వరకూ సుప్రీంకోర్టులో సేవలందించనున్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన నాలుగో ధర్మాసనంలో కూర్చొన్నారు.
జస్టిస్ బివి నాగరత్న : కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన ఐదో ధర్మాసనంలో కూర్చొన్నారు.
జస్టిస్ సిటి రవికుమార్ : కేరళ హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. 2025 జనవరి 6న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ హషీకేశ్ రారులో కూడిన ఆరో ధర్మాసనంలో కూర్చొన్నారు.
జస్టిస్ ఎంఎం సుందరేశ్ : మద్రాస్ హైకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. 2027 జులై 21న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కష్ణమురారిలతోకూడిన ఏడో ధర్మాసనంలో కూర్చొన్నారు.
జస్టిస్ బేలా ఎం త్రివేది : గుజరాత్ హైకోర్టులో ఐదో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. 2025 జూన్ 10న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ఎనిమిదో ధర్మాసనంలో కూర్చొన్నారు.
జస్టిస్ పిఎస్ నరసింహ : సుప్రీం కోర్టు బార్ నుంచి పదోన్నతి పొందారు. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస దినేశ్ మహేశ్వరిలతో కూడిన తొమ్మిదో ధర్మాసనంలో కూర్చొన్నారు.