Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీకి చెందిన 13 ఏండ్ల దళిత బాలిక.. గరుగావ్లో ఘటన
ఢిల్లీ: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. బాలికల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. నిత్యం ఏదో ఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతు న్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ 13 ఏండ్ల బాలిక లైంగికదాడి.. ఆపై హత్యకు గురైన దారుణ ఘటన గురుగావ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నరేలా ప్రాంతానికి చెందిన మైనర్.. గురుగావ్‌లో లైంగికదాడి అనంతరం హత్యకు గురైంది. ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని బంధువే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. తమ కుమార్తె దహనసంస్కారాలు వెంటనే పూర్తి చేయాలంటూ యజమాని బంధువు తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది. దీనిపై మృతురాలి తండ్రి మాట్లాడుతూ.. 'సోదరుడి భార్య ప్రసవించడంతో సాయం చేయడానికి అంటూ మా యజమానురాలు నా కుమార్తెను జూలై 17న గురుగావ్‌కు పంపారు. నా కుమార్తె చనిపోయిందంటూ ఆగస్టు 23న యజమాని నాకు ఫోన్ చేసి చెప్పారు. రాత్రి 7గంటల సమయంలో మృతదేహాన్ని మా ఇంటికి తీసుకువచ్చి, వెంటనే దహన సంస్కారాలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేశార'ని తెలిపారు. యజమానురాలి సోదరుడు ప్రవీణ్ వర్మ, ఇతరులు కలిసి తన కుమార్తెను చంపారని ఆరోపించారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించగా.. హత్యకు ముందు బాలికపై లైంగికదాడి జరిగినట్టు తేలడంతో గురుగావ్ పోలీసులు వివిధ సెక్షన్లతోపాటు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసి, నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేశారు.