Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆస్తులు రూ.38 లక్షల కోట్లకు చేరాయి. 'బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100' రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా అధిక విలువైన బ్రాండ్లలో ఎల్ఐసీ మూడో స్థానంలో ఉంది. విలువపరంగా 10వ స్థానంలో ఉంది. 1956లో ఎల్ఐసి కేవ లం రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైంది. సెప్టెంబర్ 1 నాటికి 65 ఏండ్ల ప్రస్తానాన్ని ముగించుకుని.. 66వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ 65 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో సంస్థ అనేక మైలురాళ్లు, విజయాలు నమోదు చేశామని ఎల్ఐసీ తెలిపింది. బీమా అంటేనే ఎల్ఐసీ అనే పర్యాయపదంగా ఇప్పటికీ విరజిల్లుతోంది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత బీమా రంగంలోకి రెండు డజన్లపైగా ప్రయివేటు కంపెనీలు వచ్చిన మార్కెట్ వాటాలో ఎల్ఐసీ రారాజుగానే కొనసాగుతోంది. ప్రయివేటు రంగం నుంచి తీవ్ర పోటీ నెలకొన్న ప్పటికీ వినూత్నమైన పాలసీలతో ఎల్ఐసీ మార్కెట్లో తన అగ్రస్థానాన్ని నిల బెట్టుకుంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి ప్రీమియం వసూళ్ల పరంగా చూస్తే ఎల్ఐసీ వాటా 66.18 శాతంగా ఉంది.
కరోనలోనూ 2 కోట్ల పాలసీల విక్రయం
గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎల్ఐసి 2.10 కోట్ల కొత్త పాలసీలు విక్రయించింది. దీంతో రూ.1.84 లక్షల కోట్ల విలువ చేసే తొలి ఏడాది ప్రీమియంను వసూలు చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 3.48 శాతం ఎక్కువ. కరోనా కష్టకాలంలోనూ పాలసీల విక్రయం, ప్రీమియం వసూళ్లలో మెరుగైన ప్రగతిని కనబర్చింది. దేశ వ్యాప్తంగా 8 జోనల్, 113 డివిజినల్ కార్యాలయాలు, 2048 శాఖలు, లక్ష మందికి పైగా ఉద్యోగులు, 13.53 లక్షల ఏజెంట్లతో ఎల్ఐసీ సేవలందిస్తోంది. దాదాపుగా 32 రకాల పాలసీలను విక్రయిస్తోంది. ఇటీవల పలు బ్యాంక్‌లతో భాగస్వామ్యమై క్రెడిట్ కార్డులను జారీ చేస్తోంది. రద్దయిన పాలసీల పునరుద్దరణ కోసం ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 22 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టింది.