Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదీ..ప్రయివేటు ఆస్పత్రులకు సమకూరిన వ్యాక్సిన్ల సంఖ్య
- ఆర్టీఐ సమాచారంలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్లు కేటాయించినదాని కంటే తక్కువ శాతం సమకూర్చుకున్నాయి. మే 1 నుంచి ఆగష్టు 17 మధ్య కేవలం 9.4 శాతం కోవిడ్ వ్యాక్సిన్లను అవి కొనుగోలు చేశాయి. నిబంధనల ప్రకారం.. ప్రయివేటు ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సిన్ డోసుల కేటాయింపు జరిగింది. కానీ, కేటాయించిన దాని కంటే ఈ గణాంకాలు తక్కువగా ఉండటం గమనార్హం. కాగా, ఈ 9.4 శాతంలో.. ఆగష్టు 13 నాటికి 65 శాతం డోసులను అందించాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం కింద అందిన సమాచారం ప్రకారం ఈ విషయం బహిర్గతమైంది.ఈ సమాచారం ప్రకారం.. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రయివేటు ఆస్పత్రులకు మొత్తం సప్లైలో 2 శాతం కంటే తక్కువ డోసుల పంపిణీ జరిగింది. ఇక మరో 8 రాష్ట్రాల్లో ఇది రెండు నుంచి నాలుగుశాతంగా ఉన్నది. జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేస్తుంది.