Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపన్నులకు,సామాన్యుల మధ్య తేడా చూపుతున్న తీరుపై ఆక్షేపణ
- సోషల్మీడియాలో నకిలీ వార్తలపై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ: ''దేశంలో ప్రతి విషయాన్ని మత కోణంలో చూపుతున్నారు. ఇది దేశంపై దుష్ప్రభావం చూపుతోంది. సోషల్మీడియా, వెబ్ పోర్టళ్లలో కంటెంట్ విషయంలో జవాబుదారీతనం కన్పించట్లేదు. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాలు దేన్నయినా ప్రచురించగలుగుతున్నాయి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే అవకాశం ఉన్నది. నియంత్రణ వ్యవస్థ లేక వ్యక్తుల పరువుకు నష్టం జరుగుతోంది. వ్యవస్థలు, న్యాయమూర్తులను కూడా చెడుగా చూపిస్తున్నారు'' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అసహనం వ్యక్తం చేశారు.తబ్లీగి జమాత్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ సందర్భంగా సోషల్మీడియా,వెబ్ పోర్టళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.కొన్ని మాధ్యమాలతీరు వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తున్నదని అభిప్రాయపడింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయనీ, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.ంది.సోషల్మీడియా సంస్థలు కేవలం బలవంతుల మాటలనే వింటున్నాయనీ,ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయని జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు.సామాజిక మాధ్యమ వేదికలు సామాన్యులకే కాదు.. న్యాయమూర్తులకు కూడా స్పందించట్లేదని అన్నారు. ఈ పరిణామాలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఐటీ నిబంధనలపై అన్ని హైకోర్టుల్లో దాఖలపై పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. వీటిపై ఆరు వారాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.