Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 25 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు
- బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 'సంయుక్త కిసాన్ మోర్చా' సెప్టెంబర్ 25న తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని సీపీఐ(ఎం), సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎం-ఎల్) పార్టీలు ప్రకటించాయి. భారత్‌బంద్‌లో పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సాధారణ పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరుతూ వామపక్ష పార్టీలు గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 10నెలలుగా దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించటం కోసం చట్టపరమైన హామీ తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులతో చర్చించడానికి మోడీ సర్కార్ నిరాకరిస్తోంది. తీవ్రస్థాయిలో రైతులు ఆందోళనకు దిగుతున్నా..కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ధోరణిని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూతన సాగు చట్టాల్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాయి.