Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కేరళలో ఏం జరుగుతోంది?'.. ఇటీవలి కాలంలో నాకు తరచూ ఎదురౌతున్న ప్రశ్న. కేరళలో కోవిడ్-19 వ్యాప్తి పరిస్థితులపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే వీటిల్లో అధిక శాతం అశాస్త్రీయంగా, పక్షపాతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల కంటే విజయం ముందుగా వచ్చినప్పుడు సొంత సమస్యలను కూడా తెస్తుంది. గతేడాది డిసెంబర్లో సెరోప్రెవాలెన్స్(జనాభాలో వ్యాధికారక స్థాయి) భారత్‌లో 21 శాతం ఉండగా, కేరళలో 10.7 శాతంగా ఉంది.
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు, ఆంక్షలను అమలు చేయడం ద్వారా ఇంత తక్కువగా నమోదైంది. 2021, జులై నాటికి దేశంలో వ్యాధిబారిన పడని వారిలో ఈ సెరోప్రెవాలెన్స్ 67.6 శాతం ఉండగా, కేరళలో 56 శాతం ఉంది.
అస్థిరమైన అధిక స్థాయిలో ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉన్నప్పటికీ, కరోనా మరణాలను కేరళ ప్రభుత్వం తగ్గించగలిగింది. ముందస్తు రోగ నిర్ధారణ, వ్యాధిపై మెరుగైన అవగాహన కారణంగా రోగులు స్వచ్ఛందంగా ముందుకు రావడం, తగిన చికిత్స సదుపాయాల కారణంగా ఇది సాధ్యమైంది.
వేరియంట్ల పాత్ర
రాష్ట్రంలోని జనాభా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని భావించిన సమయంలో అధిక ప్రభావం కలిగిన డెట్టా వేరియంట్ కేరళలో వ్యాపించింది. జులై, ఆగస్టులో కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఒకటి కంటే ఎక్కువ వేరియంట్లు కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సంక్రమణను మరింత పెంచే హోస్ట్ రిసెప్టర్ అఫినిటీలో ఏమైనా మార్పు ఉందో లేదో అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిణాత్మక అనుసరణ, జాతుల గుర్తింపు, హోస్ట్ రిసెప్టర్ అఫినిటీ, వ్యాధికారతను అంచనా వేసేందుకు జన్యు ముటేషన్లు(ఉత్పరివర్తనాలు) అవసరం. మరణాలు ఎక్కువగా లేనందున.. కేరళలోని వేరియంట్లు జన్యుపరమైన లక్షణాలను అర్థం చేసుకునేందుకు సహాయపడతాయా? తద్వారా మెరుగైన రిసెప్టర్ అఫినిటీలో అనుసరణలు, మార్పులకు దారితీస్తుందా? అనేది పరిశీలించాలి.
విభిన్న వ్యూహం
పాలసీ ప్రకటనల్లో పేర్కొన్నా లేకున్నా.. గతంలో ఎక్కువ సంఖ్యలో కరోనా ఇన్ఫెక్షన్లను నివారించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విఫలమైన 'జీరో కోవిడ్ స్ట్రాటజీ'తో పోలుస్తూ కొంత మంది కేరళ కూడా అదేవిధానాన్ని అనుసరిస్తోందని ఊహిస్తూ విమర్శలు చేశారు. అయితే ప్రభుత్వం తమ చేతల ద్వారా కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రంలో మరణాలు తక్కువగా నమోదయ్యేందుకు పలు కారణాలు ఉన్నాయి. మొదటిగా, రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా వ్యాధిపై మెరుగైన అవగాహన కల్పించడం, ప్రజల సహకారం, గతంలో నిపా వంటి వైరస్‌లను విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవం, మహమ్మారిపై ఎలా పోరడాలో స్పష్టమైన అవగాహన ఉండడం. రెండోది, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల కొరత వంటి కారణాల వలన చోటుచేసుకున్న మరణాలు నియంత్రణ వ్యూహాలు, అధిక వ్యాక్సినేషన్ కవరేజీ కారణంగా కేరళలో లేవు. వ్యూహాలపై ఈ రెండు అభిప్రాయాలు ఉండగా, డేల్టా వేరియంట్ వచ్చేవరకు కేరళలో కరోనా నియంత్రణలో ఉంది. ఇదే సమయంలో ఈ అంటువ్యాధి ఉనికి కూడా ఉంది. వ్యూహం భిన్నంగా ఉన్నందున కేసుల పెరుగుదలకు రాష్ట్రాన్ని నిందించలేరు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆంక్షల సడలింపుతో రాష్ట్రాలకు ప్రజల రాకపోకలు పెరిగాయి. పాజిటివ్ కేసుల సంఖ్యను తారామారు చేసేందుకు పరీక్షల సంఖ్యను తగ్గించడం వంటి చర్యలు రాష్ట్రం చేయలేదు.
కోవిడ్‌పై విజయం అంటే ఏంటి?
కోవిడ్-19పై విజయం అంటే వైరస్ కారక మరణాలు తక్కువగా చోటుచేసుకునేలా చూడడంలో ఉంటుంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో వైరస్, హోస్టులు (మానవులు) ఎలా ప్రవర్తిస్తారనే దాని గురించి ప్రతీది తెలియదు. ఆగస్టు 27, 2021 నాటికి కేరళ తన లక్ష్య జనాభాలో 71 శాతం మందికి ఒక డోస్, 26 శాతం మందికి రెండు డోసులతో టీకాలు వేసింది. 60 శాతం(రెండు డోసులకు) కంటే ఎక్కువ టీకా కవరేజ్ ఉన్న బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల్లో కూడా కేసుల్లో వృద్ధి కనిపిస్తోంది. అధిక కేసుల అంటే అది విఫలమైన వ్యూహం అని అర్థం కాదు. బ్రిటన్, అమెరికా, ఇజ్రాయిల్‌లో ఉన్న కరోనా పరిస్థితులు 70 శాతం కంటే ఎక్కువ రెండు డోసులు వేసిన స్పెయిన్ వంటి దేశాల్లో లేవు. వైరస్ అనుసరణ, ప్రతిరోధకాల క్షీణత, మెరుగైన పర్యవేక్షణతో సహా పలు ఇతర అంశాలు కేసుల పెరుగుదలకు దారితీస్తాయి.
కేరళ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తరువాత ఏమి జరుగుతుందో సెరోప్రెవాలెన్స్, టీకా కవరేజ్ మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ సెరోప్రెవాలెన్స్, పేలవమైన టీకా కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు మరియు మరణాలు సంభవిస్తాయి. అందువల్ల, రాష్ట్రంలోని వ్యాక్సినేషన్‌ను విస్తరిస్తూనే ముందస్తుగా కేసుల గుర్తింపు ప్రయత్నాలు, మెరుగైన నిర్వహణను కొనసాగించడంలో కేరళ మోడల్ దేశానికి ఒక పాఠాన్ని అందిస్తుంది. డెల్టా వేరియంట్ అధిక టీకా కవరేజ్ ఉన్న దేశాలను కూడా ప్రభావితం చేశాయి. అయితే ఆయా దేశాల్లో వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండడం, తక్కువ మరణాలు ఉండడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఇది సరైన వ్యూహమని కేరళ నిరూస్తుంది. చివరగా, కేరళ విఫలమైన మోడల్ కాదు. వాస్తవానికి, ఈ మోడల్ నుండి పాఠాలు నేర్చుకోకపోతే అది వైఫల్యం అవుతుంది.
- గిరిధర ఆర్ బాబు-ఎపిడెమియాలజీ ప్రొఫెసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, పిహెచ్‌ఎఫ్‌ఐ, బెంగళూరు