Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభలో వెనుక బెంచీల్లో కూర్చున్న సిద్ధూ గ్రూపు ఎమ్మెల్యేలు
చండీఘర్ : గురుతేజ్ బహదూర్ 400వ పర్కాష్ పురబ్ వేడుకల నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి అమరీంగ్ సింగ్ను వ్యతిరేకిస్తున్న పిపిసిసి అధ్యక్షులు నవ్జోత్ సింగ్ సిద్ధూ గ్రూపు ఎమ్మెల్యేలు వెనుక బెంచ్ల్లో కూర్చోవడం కనిపించింది. అదేవిధంగా రెబల్ మంత్రులుగా ఉన్న త్రిపాద్ రాజిందర్సింగ్ భజ్వా, సుఖిందర్సింగ్ రంధవా, సుఖ్ సర్కారియా, చరణ్జిత్ సింగ్ ఛన్ని కూడా సిఎంకు దూరంగా కూర్చోవడం గమనార్హం. వీరంతా గత అసెంబ్లీ సెషన్లలో అమరీందర్ సీటుకు దగ్గరిగా ఉన్న సీట్లలో కూర్చున్నారు. కాంగ్రెస్లో చీలిక ఏర్పడిన నేపథ్యంలో సిఎం అమరీందర్ సభలో మెజార్టీ నిరూపించుకోవాలని ప్రతిపక్ష అకాలీదళ్ నేత బిక్రం మజిథియా డిమాండ్ చేశారు. అయితే ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోని స్పీకర్ సభను వాయిదా వేశారు. అంతకుముందు సంతాప తీర్మానాలు ముగిసిన తర్వాత సభుడు రాణా గుర్మిత్ సోధి మాట్లాడుతూ క్రీడాకారులైన నిర్మల్ మిల్కాసింగ్, యశ్పాల్ శర్మ పేర్లను కూడా సంతాపం తెలిపే వారి జాబితాలో చేర్చాలని సభను కోరారు.