Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అల్జీమర్స్ సమస్య ప్రపంచానికి పెద్ద సమస్యగా మారనున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించిన సమాచారమే దీనిని తెలియజేస్తున్నది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 2030 నాటికి 7.8 కోట్లకు (78 మిలియన్లకు) పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో అంచనా వేసింది. అలాగే, 2050 నాటికి ఇది 13.9 కోట్లకు చేరుకుంటుందని వివరించింది. డబ్ల్యూహెచ్ఓ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్తో బాధపడుతున్నవారి సంఖ్య 5.5 కోట్లు (55 మిలియన్లు)గా ఉన్నది. అల్జీమర్స్తో బాధపడుతున్నవారిలో 65 ఏండ్లకు పైబడినవారిలో 8.1శాతం మంది మహిళలు ఉన్నారు. 5.4 శాతం మంది పురుషులు ఉన్నారు. కాగా, ఈ పరిస్థితిని అణచివేయడంలో ప్రపంచం విఫలమవుతున్నదని డబ్ల్యూహెచ్ఓ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా మూడో వంతు దేశాలు మాత్రమే ఈ విషయంలో ఒక విధానాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నది.