Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
- పదవి ఖాళీగా ఉండటం రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ : దాదాపు 15 నెలలుగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంపై ఢిల్లీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 830రోజులుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉందని, ఆ పదవిని భర్తీ చేయకపోవటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 93ను ఉల్లంఘించటమేనని ఢిల్లీ హైకోర్టులో పవన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, ఈ అంశాన్ని ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే తమ డిమాండ్‌ను మోడీ సర్కార్ ఏమాత్రమూ పట్టించుకోవటం లేదని లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరీ అన్నారు.