Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్జీలు, లాయర్లపైనే దాడులు
- మరింత ప్రమాదంలో ఆర్టీఐ కార్యకర్తల ప్రాణాలు
- దేశ పరిస్థితులపై నిపుణుల, విశ్లేషకుల ఆందోళన
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు ఘటనలు సామాన్యుల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశ స్వతంత్ర సంస్థలు మొదలుకుని శక్తివంతమైన స్థానంలో ఉన్నవారిపైన సైతం దాడులు జరుగుతున్న నేపథ్యం.. ప్రస్తుత పరిస్థితులపై నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులై 28న ధన్బాద్ జిల్లా సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ రొడ్డుపక్కగా మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఖాళీగా ఉన్న రొడ్డుపై వచ్చిన ఓ ఆటోతో ఢకొీట్టి చంపారు. రెండేండ్ల క్రితం ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ తొలి మహిళా చైర్ పర్సన్ దర్వేష్ యాదవ్ నియామకం జరిగిన రెండు రోజులకే ఆగ్రా కోర్టు ఆవరణలో కాల్చి చంపబడ్డాడు. ఇలా చెప్పుకుంటుపోతే ఈ తరహా ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, ధన్బాద్ జడ్జి కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు దానిపై చేసిన వ్యాఖ్యలు దేశంలో నెలకొన్న భయానక పరస్థితులకు, పోలీసు, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల లోపాయికారీ వైఖరిని ప్రతిబింభించాయి. న్యాయవాదులు, జడ్జిల రక్షణ విషయంలోని ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలంటూ స్వతంత్ర సంస్థలతో పాటు కేంద్రానికి సూచించింది. శక్తివంతమైన న్యాయవ్యవస్థలో, భద్రత కలిగిన వారిపై దాడలు జరుగుతుండటంతో వీరికి దగ్గరగా సంబంధం కలిగివున్న సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్తలు, అన్యాయాన్ని ప్రశ్నించేవారి ప్రాణాలు మరింతగా ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. పోలీసులపై ఆధారపడకుండా న్యాయమూర్తులు, లాయర్లు, కోర్టు ప్రాంగణాల రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నియంత్రణలో ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. ఏదేమైనప్పటకీ, రాజ్యంగం ప్రకారం పౌరులందరి జీవితాలు సమానమే అంశం తెరమీదకు వచ్చి, చర్చకు తీసుకువచ్చింది.
దాడులకు మూలకారణం ఇదే..
న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఆర్టీఐ కార్యకర్తలు, అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై దాడులు పెరుగుతుండటానికి ప్రధాన కారణం అవినీతి అని స్పష్టంగా తెలుస్తోంది. అనేక ఉన్నత స్థాయి కేసులు వాదనలు, తీర్పుల, ధనవంతులు, సమాజంలో ఆర్థికంగా శక్తివంతమైన వారికి సంబంధించినవి అయినప్పుడు ఈ దాడులు జరుగుతున్న అంశాలు ఉన్నాయి. ప్రతికూల తీర్పులు వారిని ప్రభావితం చేయడంతో పాటు ఈ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే గోలుసును సైతం ప్రభావితం చేస్తోంది. ఇందులో ఆర్టీఐ కార్యకర్తలు, సాక్షులు, రాజీపడటానికి నిరాకరించే న్యాయవాదులు, న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు ఉంటున్నారు. వీరికి బెదిరింపులు, దాడులే కాకుండా ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరగుతున్నాయి. కాబట్టి దీనిని అధిగమించే పోరాటంతో మొదటి ముందడుగు 'అవినీతిని పారదోలడం' అని నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవినీతి అంశం సమాజంలోని ప్రతి ఒక్కరినీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తోందని వెల్లడిస్తున్నారు. కాబట్టి భద్రతను అందించడమే కాకుండా, అవినీతిని గణనీయంగా తగ్గించే వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించాలనీ, జవాబుదారీతనాన్ని సైతం పెంచాలని సూచిస్తున్నారు.
పోలీసులు, భద్రతాధికారుల తీరు...
ఇటీవల సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా పోలీసు స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్త చేసింది. అత్యున్నత న్యాయస్థానం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఓ పోలీసు అధికారి కేసు విచారణ సందర్భంగా పోలీసులు అధికారి రాజకీయ పార్టీల వైపు మొగ్గుచూపుతున్న అంశాలపై వ్యాఖ్యానించారు. పంజాబ్లో ఓ డీజీబీ అక్రమంగా అధిక సంపదను కూడబెట్టారని ఆరోపణలున్నాయి. ముంబయి మాజీ ఓ పోలీసు కమిషనర్, అప్పటి రాష్ట్ర హౌం మంత్రి కలిసి దోపిడీ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులల్లో ధనవంతులు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉంటే ఎంతటి క్రిమినల్ ఘటనైనా చార్జిషీట్లు నమోదుకావడానికి సంవత్సరాలు పడుతోంది. ఈ కాలంలో ఫిర్యాదుదారులను కేసు ఉపసంహరణ కోసం బెదిరింపులు, దాడులు చేసుకోవడం.. పలు ఘటనల్లో పోలీసులు నేరస్తులకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు సామాన్యుల పరిస్థితి ఈ విషయంలో ఎంత దారుణంగా ఉంటుందో స్పష్టంగా తెలుపుతున్నాయి.
ఆర్టీఐ, సామాజిక కార్యకర్తపై..
దేశంలో అవినీతి, అన్యాయం, దాడులు, చట్టవ్యతిరేక చర్యలకు సంబంధించిన అంశాలను అడ్డుకోవడం, వెలుగులోకి తీసుకురావడంలో సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ కార్యకర్తలు దేశవ్యాప్తగా గొప్ప పనితీరును కనబరుస్తూ.. మెరుగైన సమాజం కోసం పోరాడుతున్నారు. అయితే, ఈ క్రమంలో వారిపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే అనేక మంది బెదిరింపులకు, దాడులకు గురి కాగా, వీరిలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. సామాన్యుల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. దీనిని నివారించడానికి జాతీయ స్థాయిలో ఓ సమన్వయ వ్యవస్థ అవసరమని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.