Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 600 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ రంగ సంస్థల జాగాలు
- ఈ బిడ్డింగ్ ద్వారా అమ్మేందుకు కేంద్రం యోచన
- 10 వేల కోట్లు సేకరించాలని మోడీ సర్కార్ లక్ష్యం
న్యూఢిల్లీ : జాతి సంపదను అమ్మేందుకు మోడీ సర్కార్ యోచిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ప్రయివేటీకరణ, అమ్మకం వంటి వాటికి వడిగట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడు ఏకంగా ఆ సంస్థల భూములపై కన్ను పడింది. పీఎస్యూల భూముల అమ్మకానికి మోడీ సర్కార్ సిద్ధ పడింది. దేశంలోని రూ.600 కోట్లకు పైగా విలువ చేసే పీఎస్యూల భూములను ఈ బిడ్డింగ్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించాలని యోచిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఎఎం) ద్వారా నిర్వహించబడుతున్న ఈ ప్రక్రియ, నిటి ఆయోగ్ ద్వారా మోనిటైజేషన్ కోసం చూపించిన ప్రధాన ఆస్తుల పైప్లైన్ మాదిరిగానే ఉంటుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)లతో పాటు మరికొన్ని సంస్థల భూములను బ్లాక్లో ఉంచడానికి డీఐపీఎఎం త్వరలో తుది ఆమోదముద్రపడనున్నది. ఇది ఎంఎస్టీసీ అభివృద్ధి చేసిన నూతన ఈ బిడ్డింగ్ ప్లాంట్ఫామ్ ద్వారా మొదటి ఆస్తుల అమ్మకం అవుతుంది. ఈ పోర్టల్లో ఎక్కువ ఆస్తులను బిడ్డింగ్ కోసం పొందుపరుస్తున్నారు. దీనికి సంబంధించి చర్యలు జరుగుతున్నాయి. నూతన బిడ్డింగ్ ప్లాంట్ఫామ్ ద్వారా రూ.10 వేల కోట్లు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఒక అధికారి తెలిపారు. సీబీఆర్ఈ సౌత్ ఆసియా, డీటీటీఐ, బీసీజీ, జేఎల్ఎల్ ప్రొపర్టీ కన్సల్టెంట్స్ (ఇండియా), కేఎఫ్ఐ కన్సల్టెంట్లు జాబితా తయారు చేసేందుకు డీఐపీఎఎంకు సహకరిస్తాయి. ఈ కన్సల్టెంట్ సంస్థలు ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రతిపాదనల విజ్ఞప్తులు (ఆర్ఎఫ్పీ), ఇతర డాక్యుమెంట్లను తయారు చేస్తాయి. ఈ కన్సలెంట్లు భూమి ఆస్తులకు సంబంధించిన విలువ ఆధారంగా ఒక రిజర్వ్ ధర నిర్దేశిస్తాయి. దానికనుగుణంగా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనల్సి ఉంటుంది. ఈ బిడ్డింగ్ ప్లాంట్ఫామ్లో కొనుగోలుదారులు రిజిస్ట్రర్ చేసుకోవాలి. తుది ఆమోదం పొందిన వెంటనే ప్లాంట్ఫామ్ అందుబాటులోకి వస్తుందని ఒక అధికారి తెలిపారు. భూమి ఆస్తుల పైప్లైన్లో భాగంగా ఈ ప్రక్రియ జరుగుతున్నదని వివరించారు.