Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లెయిమ్స్ చెల్లింపుల్లో ఆలస్యం.. రైతులకు భారం
- జాబితాలో బీమా సంస్థలే కాదు.. రాష్ట్రాలు కూడా..!
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) రైతులకు తలనొప్పిగా మారింది. వారికి చెల్లించాల్సిన క్లెయిమ్‌లు సెటిల్ కాకపోవడం వారికి ఇబ్బందులను తెస్తున్నది. ఇవి వారిపై అదనపు భారాన్ని వేస్తున్నాయి. ఈ క్లెయిమ్‌లను సెటిల్ చేసే విషయంలో బీమా సంస్థలు మాత్రమే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలవడం గమనార్హం.దేశంలోని అనేక రాష్ట్రాలు తమ సబ్సిడీ వాటాను 30 శాతానికి పరిమితం చేయాలని డిమాండ్ చేశాయి. సబ్సిడీ వాటా విడుదలలో జాప్యానికి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ జరిమానా విధించలేదని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. పంటల బీమా మొత్తాలను రైతులకు ఆలస్యంగా విడుదల చేయడంలో కంపెనీలు తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ తప్పు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నందున వారి సబ్సిడీ వాటాను ప్రీమియంపై చెల్లించడంలో విఫలమవుతున్నాయి.ఒక వార్త సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద ఆగష్టు 16 నాటికి రూ. 2,287 కోట్ల విలువైన క్లెయిమ్‌లు రైతులకు చెల్లించకపోవడం గమనార్హం. అయితే, రాష్ట్రాలు తమ ప్రీమియం వాటా రూ. 1879 కోట్లను విడుదల చేయకపోవడం గమనార్హం. గుజరాత్, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలు అత్యధిక డిఫాల్టర్లుగా ఉన్నాయి. ఇవి 90 శాతానికి పైగా బకాయిలు కలిగి ఉన్నాయి. ఇక చాలా రాష్ట్రాలు గత సీజన్ దిగుబడి డేటాను ఇంకా ఖరారు చేయలేదు.0
కాగా, పంట బీమా లబ్దిదారులలో 80 శాతం కంటే ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు 2 హెక్టార్ల కంటే తక్కువ ఉన్నందున ప్రీమియం సబ్సిడీ చెల్లింపు, క్లెయిమ్‌ల చెల్లింపులో జాప్యానికి తక్షణ విధాన చర్యలు అవసరమని విశ్లేషకులు తెలిపారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులు వడ్డీతో చెల్లించిన ప్రీమియంను నిర్ణీత కాల వ్యవధిలో తిరిగి ఇచ్చేయాలని వ్యవసాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గతనెల 10న పార్లమెంటులో సమర్పించిన నివేదికలో పేర్కొన్నది.