Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కరోనా సంక్షోభం...
- ప్రభుత్వాల అనాలోచిత, మానవత్వం లేని విధానాలే కారణాలు
- ఒకవైపు రికార్డు స్థాయిలో ఆహార ధాన్య ఉత్పత్తులు
- మరోవైపు తిండికోసం అలమటిస్తున్న ప్రజలు
న్యూఢిల్లీ : కోవిడ్ సంక్షోభం, ప్రభుత్వాల అనాలోచిత మానవత్వంలేని విధానాలు దేశంలో అధిక శాతం మందిని వినాశనం వైపు నెట్టాయి.అన్నం కోసం అలమటించే విధంగా చేశాయి.పదేపదే విధించిన లాక్డౌన్లతో ఉద్యోగాలు,ఆదాయాలు కోల్పోవడంతో అధిక మంది ప్రజలు ఆహారం కోసం ఎదురుచూడాల్సిన స్థితిలో ఉన్నారు.మరొవైపు, ఇలాంటి సమయంలో ఒక తరగతి ప్రజలకు మాత్రమే కొద్ది మొత్తంలో ఆహారధాన్యాలను, కొంత ఆర్థిక సహాయాన్ని అది కూడా కొన్ని నెలలు మాత్రమే ప్రభుత్వం అందించింది. దీంతో ప్రజలు ఆకలిని తట్టుకో వడానికి గడ్డి, అడవి దుంపలు తినడం, ఆహారం కోసం ఇరుగుపొరుగు వారిని, ఛారిటీలను అర్థించడం, మనుగడ కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయడం వంటి పనులు చేయాల్సివచ్చింది. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విషాదకరం. అడవిపై ఆధారపడిన గిరిజనులు,భూమిలేని వ్యవసాయ కార్మికులు, మూసి వేయబడిన పరిశ్రమల కార్మికులు,దినసరి కూలీపై ఆధారపడిన అధిక శాతం ప్రజలు ఈ విధమైన బాధలు అనుభవిస్తున్నారు.తమిళనాడులోని అన్నమలై టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులయర్ సామాజిక వర్గానికి చెందిన భువనేశ్వరి దేవి తన కుటుంబంతో సహా నివస్తుంది. లాక్డౌన్ నిబంధనలతో అటవీ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం లేకపోవడం, రేషన్‌కార్డు లేక ప్రభుత్వ సహాయం అందకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్,మే వారి కుటుంబం అంతా మనుగడ కోసం అటవీ దుంపలతో చేసుకున్న గంజినే తాగారు.'ఈ దుంపలతో ఎంతకాలం జీవించాలి' అని భువనేశ్వరి నిరాశగా ప్రశ్నించింది. దేశంలో అధిక శాతం గిరిజనలు ఆటవీ ఉత్పత్తులను అమ్ముకునే జీవనం సాగిస్తా రు. లాక్డౌన్ సమయంలో రవాణా వ్యవస్థ స్థంభించడంతో వీరి జీవనోపాధికి విఘాతం కలిగింది. మిగిలిన సమాజం నుంచి వీరికి సంబంధాలు తెగిపోయాయి. తమిళనాడులో 40 వేలకు పైగా గిరిజన కుటుంబాలకు రేషన్‌కార్డు లేదు. దీంతో వారికి సబ్సిడీ ఆహారా ధాన్యాలు అందడం లేదు.
రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యవసాయ కార్మికుల ఆకలి కేకలు
దేశంలో ఏడాది మొత్తం రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగినా, మరోవైపు భూమిలేని వ్యవసాయ కార్మికులు, సన్నకారు రైతులు కూడా ఆకలి సంక్షోభంలో చిక్కువడం ఆందోళన కలిగిస్తోంది దేశంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 395 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అయినా వ్యవసాయ కార్మికుల వేతనాలు, సన్నకారు రైతలు ఆదాయాలు పడిపోయాయి. ఒక అంచనా ప్రకారం దేశంలో 140 మిలియన్లకు పైగా భూమిలేని వ్యవసాయ కార్మికులు ఉన్నారు.ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 2020 అంచనా ప్రకారం 189 మిలియన్ల భారతీయులు ఆకలితో బాధపడ్డారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో సామూహిక ఆకలి బాధ పడిన 107దేశాల్లో భారత్ 94వ స్థానంలో నిలిచింది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే 2015-16దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 59శాతం మంది, మహిళల్లో 53శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మొత్తంగా 38శాతం చిన్నారులు ఎము కల గూడుగా, 20శాతం మంది చిన్నారులు అచేతనంగా మారిపోయారు.ఇవి రెండు దీర్ఘకాలిక పోషకాహార లోపానికి సంకేతాలు.ఈ పరిస్థితిని మహామార్మి మరింత తీవ్రంగా మార్చింది. ప్రభుత్వాల వద్ద దీనికి సమాధానం లేదు.
పట్టణ ప్రాంతాల్లోనూ పరిస్థితి తీవ్రతరం
కేవలం గ్రామీణ ప్రాంతాలే ఆహార సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొలేదు.పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఇలాంటి ఇబ్బం దులు పడ్డారు.కఠినమైన లాక్డౌన్ నిబంధనలు పోలీసుల చేత మరింత క్రూరంగా అమలు చేయబడ్డాయి. అలాగే ఎలాంటి ఆర్థిక పరిహారం ఇవ్వకుండా కార్మికులను తొలగిం చడానికి యజమానులకు ఇచ్చిన అవకాశం అనేక మంది కార్మికులను నిరాశ్రయులను చేయడానికి, చివరికి మరణా లకు కూడా దారి తీసింది.
ఆహార ధాన్యాతో నిండిన గిడ్డంగులు
ప్రజలు ఈ విధంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మరోవైపు ప్రభుత్వ గిడ్డంగులు ఆహార ధాన్యాలతో నిండిపో యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే.. లాక్డౌన్ అమల్లోఉన్న 2020 ఏప్రిల్, మే నెలల్లోనే ఆహార ధాన్యాల నిల్వలు 57 మిలియన్ టన్నులు, 64.4 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.
ఆదుకున్న వామపక్ష సంస్థలు
ఇలాంటి తీవ్ర సమయంలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడంలో వామపక్ష సంస్థలు ముందు వరసలో ఉన్నాయి. ముఖ్యంగా కేరళలో సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వం ఆదర్శప్రాయంగా నిలిచింది. లాక్డౌన్ ప్రారంభ వారంలోనే 1,255 కమ్యూనిటీ కిచెన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో రోజుకు సమారు 3 లక్షల మందికి భోజనం అందించింది. కిరాణ, రేషన్ కిట్లను సామాన్యుల ఇండ్ల వద్దకే కేరళ ప్రభుత్వం చేర్చింది. ఇలాగే ఇతర రాష్ట్రాల్లో వలస కార్మికులు తీవ్రంగా బాధపడుతున్న సమయంలో కేరళలో వలస కార్మికులు (గెస్ట్ వర్కర్స్) మాత్రం ఈ కమ్యూనిటీ కిచెన్స్‌తో ఆకలి బాధ తీర్చుకున్నారు. అలాగే 1000కి పైగా పీపుల్స్ హోటల్స్‌తో సబ్సిడీ ధరలకు భోజనాన్ని అందించింది. కేరళ ప్రభుత్వంతో పాటు వామపక్ష, ప్రగతి శీల సంస్థలు ప్రజలకు రోజువారీ వినియోగ వస్తువులను పంపిణీ చేశాయి. మహమ్మారి కాలంలో కేరళ ఆహార భద్రతను సాధించడంలో ప్రభుత్వ సమర్థవంతమైన పరిపాలనతో పాటు, సమాజ ప్రయత్నాలు కూడా ఒక భాగం. అలాగే పశ్చిమ బెంగాల్లో 'రెడ్ వాలంటీర్స్' వైద్య సంరక్షణ చర్యలతో పాటు, ఆహార విభాగంలో కూడా ప్రజలకు సహాయాన్ని అందించింది.మోడీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో భారీ స్థాయిలో నిరుద్యోగాన్ని పెంచడంతో పాటు అధిక సంఖ్యలో ప్రజలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహారం వంటి ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పించింది. అయితే అదే సమయంలో కార్పొరేట్లు భారీ లాభాలను ఆర్జిం చారు. ఈ విపరీతమైన అసమానత రాబోయే రోజుల్లో ప్రజలు తమ అసహనాన్ని, ఆగ్రహనాన్ని వ్యక్తం చేయడానికి కారణంగా మారనుంది.