Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో ఆన్లైన్ విద్యపై ఆందోళన వ్యక్తమవుతున్నది. దీనిపై సెంట్రల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, ఆన్లైన్ విద్య నాణ్యతపై వారు అధ్యాపకులు ఆందోళన తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎఈపీ)ను ది ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్స్ (ఫెడ్సీయూటీఏ) వ్యతిరేకించింది. ఆఫ్‌లైన్ విద్యను భర్తీ చేయడానికి మాత్రమే ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ఉపయోగించాలని తెలిపింది. '' మహమ్మారి కారణంగా ఆన్లైన్ విద్యకు మార్గం ఏర్పడింది. అయితే మనపై ఇప్పుడది బలవంతంగా ఉన్నది. ఇది చాలా ప్రమాదకరం'' అని ఫెడ్క్యుటా అధ్యక్షుడు రాజీవ్ రే అన్నారు. ఇటీవలి కాలంలో ఉన్నత విద్య కోసం ప్రభుత్వ నిధుల తగ్గింపు అంశాన్ని అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్‌సేవక్ దూబే, నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎక్స్.పీ మావో లు హైలెట్ చేశారు.