Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : రాజస్థాన్లో ప్రతిపక్ష బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తక్కువ స్థానాలను గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. మొత్తం 1564 సీట్లకు గానూ 670 స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త బలాన్ని తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 551 స్థానాలు పొందింది. ఇవి 2015లో ఆ పార్టీ పొందిన స్థానాల కంటే తక్కువ కావడం గమనార్హం. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకున్నది. 200 స్థానాల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 90 స్థానాల్లో విజయం సాధించింది.పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటారు. 240 స్థానాల్లో వారు గెలుపొంది మూడో స్థానంలో నిలిచారు. 40 స్థానాల్లో విజయం సాధించిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) నాలుగో స్థానంలో ఉన్నది. బీఎస్పీ 11 స్థానాలు గెలుచుకున్నది. జైపూర్, జోధ్పూర్, భరత్పూర్, సవారు మాదోపూర్, దౌసా, సిరోహా జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ 64 శాతంగా నమోదైన విషయం విదితమే.