Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇటాలియన్ విద్యుత్ పంపిణీదారైన ఎనెల్ గ్రూప్ భారత విద్యుత్ పంపిణీ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. తాజాగా ఇదే విషయంపై ఎనెల్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్కో స్టారస్ మీడియాతో మాట్లాడారు.భారత విద్యుత్ పంపిణీ మార్కెట్లోకి రావడానికి వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే అతి త్వరలోనే భారత మార్కెట్లోకి ఎలెన్ కంపెనీ రానున్న ట్టు తెలుస్తోంది.దీనికి ముందు ఎనెల్ పునరుత్పాదక ఇందన వ్యాపారాన్ని దేశంలో విస్తరించే ప్రణాళికలో భాగంగా రష్యాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రజెక్టును అభివృద్ధి చేయాలని చూస్తున్నట్టు యూరప్ ఎనెల్ చీఫ్ సిమోన్ మోరి గతంలోనే చెప్పారు.హైడ్రోజన్ భవిష్యత్తులో వాతావరణ అనుకూల ఇంధనంగా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయనీ, వాతావరణ ప్రతికూల మార్పులపై పోరాడటానికి విశ్వంలో అధికంగా ఉన్న ఈ ములకం సహాయపడగలదని పేర్కొన్నారు. ప్రస్తుత ఇంధన మార్కెట్లోని వ్యాపారాలు ఇదే విధంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సైతం వాతావరణ అనుకూలంగా ఉంటుందన్నారు.కాగా,ఇటీవల విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.దీనిలోభాగంగా కేంద్ర ప్రభుత్వం 'విద్యుత్ బిల్లు-2003'కు సవరణలు తీసుకువచ్చింది.దీనిపై అభిప్రాయాలను వెల్లడించాలని ఏప్రిల్లో కోరింది.ఆగస్టులో విద్యుత్ సవరణ బిల్లు-2021ను తీసుకువ చ్చింది.ముసాయిదా సవరణ వివరాలను సంబంధిత శాఖ వెబ్సైట్లో ఉంచారు.తాజా మార్పుల కారణంగా కొత్తగా ఈ రంగంలోకి చేరేవారికి మార్గం సుగమం అయింది.టెలికామ్ సర్వీసుల మాదిరిగా విద్యుత్ వినియోగ దారులకు బహుల సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకునే అవకాశాలు వంటి వాటిని కూడా ప్రస్తావించింది. అయితే, విద్యుత్ సమరణ బిల్లు-2021ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టకముందే దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలు ఈ కొత్త బిల్లును నిరశిస్తూ ఆందోళనలు సైతం నిర్వహించాయి.