Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సైనిక సిబ్బందికి శౌర్య పతకాలను ప్రకటించే ప్రస్తుత వ్యవస్థ ఏకపక్షంగా, పారదర్శకతకు వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. వచ్చేవారంలో ఈ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశముంది. మాజీ సైనిక సిబ్బంది దాఖలు చేసిన ఈ పిటిషన్ శౌర్య పతకాలకు నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది. ప్రస్తుత ప్రకియ్ర ఏకపక్షంగానూ, రాజ్యాంగ విరుద్ధంగానూ ఉందని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం సరైన యంత్రాంగం లేకపోవడం వలన అర్హులైన అనేక మంది సిబ్బందికి అన్యాయం జరిగిందని ఆరోపించింది. ప్రస్తుతం శౌర్య పతకాల ప్రకటన ప్రక్రియ భారత రాష్ట్రపతి కార్యాలయం ఎప్పటికప్పుడు జారీ చేసే నోటిఫికేషన్ల ద్వారా నియంత్రిచబడుతుందని, ఈ ప్రకియ్ర అస్పష్టతగా ఉందని, తప్పుడు నిర్ణయాలను సమీక్షించడానికి ఎలాంటి యంత్రాంగం లేదని పిటిషన్ విమర్శించింది.