Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయం
- చౌహాన్ సర్కార్ మరో వివాదస్పదం..
బోపాల్: ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యార్థులకు ఆరెస్సెస్ నేతలు, ఇతర మహనీయుల గురించి బోధించాలని మధ్యప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవర్, భారతీయ జనసంఫ్‌ు నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, స్వామి వివేకానంద, బీఆర్ అంబేద్కర్ గురించి బోధించనున్నారు. వీరితో చరకుడు, సుశ్రుతుడు గురించి కూడా విద్యార్థులకు బోధించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంలో భాగంగా ఈ మహానుభావుల జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తున్నట్టు చెప్పారు. ఫౌండేషన్ కోర్సులో భాగంగా నైతిక విలువలు కూడా భాగం కావాలన్న జాతీయ మెడికల్ కౌన్సిల్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సారంగ్ వివరించారు. ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠ్యాంశాలు బోధించనున్నట్లు చెప్పారు. ఏటా 2000 మంది విద్యార్థులు మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్‌లో చేరుతుంటారు. సర్కారు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ''హెగ్డేవర్, దీన్‌దయాళ్ మాత్రమే ఎందుకు? గాడ్సే గురించి కూడా బోధించాల్సింది'' అంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ వ్యంగ్యంగా సర్కారుపై వ్యాఖ్యలు చేశారు.