Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిహెచ్ఆర్ పోస్టర్‌పై శివసేన విమర్శలు
పుణే : భారతీయ చరిత్ర పరిశోధనా కౌన్సిల్ (ఐసిహెచ్ఆర్) విడుదల చేసిన పోస్టర్లో జవహర్లాల్ నెహ్రూ చిత్రాన్ని విస్మరించడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ 'రాజకీయ ప్రతీకారమేనని' శివసేన ఆరోపించింది. ఇది ప్రతీ స్వాతంత్య్ర సమరయోధుడి జ్ఞాపకాలను అవమానించడమేనని శివసేన ప్రధాన అధికార ప్రతినిధి, ఎంపి సంజరు రౌత్ అన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో తన వీక్లీ కాలమ్ 'రోఖ్తోక్'లో బిజెపి, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా బ్రాడ్‌సైడ్‌ను రౌత్ ప్రారంభించారు. 'స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొననివారు చరిత్రను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వారు స్వతంత్య్ర పోరాటంలో హీరోలను (పండింట్ నెహ్రా)లను పక్కన పెట్టాలను కుంటున్నారు' అని అన్నారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలను, స్వల్ప బుద్ధిని బయటపెట్టిందని విమర్శించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఐసిహెచ్ఆర్ విడుదల చేసిన పోస్టర్లో నెహ్రూ, మౌలానా అబుల్ కలామ్ అజాద్ చిత్రాలు లేకపోవడంపై అనేక విమర్శలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.