Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో సీపీీఐ(ఎం) నిర్ణయం
తిరువనంతపురం : రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనపై దృష్టి సారించడానికి అధికార ఎల్డీఎఫ్కు నేతృత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) నిర్ణయం తీసుకున్నది. మరీ ముఖ్యంగా, ప్రభుత్వ నిర్ణయాలను పర్యవేక్షించడానికి ఆ పార్టీ నిర్ణయించినట్టు రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ప్రభుత్వంతో పార్టీ సమన్వయానికి సంబంధించిన అంశం పైనా పలు సమావేశాలు నిర్వహించినట్టు సీపీఐ(ఎం) సీనియర్ నాయకుల ద్వారా తెలిసిందని చెప్పారు. ప్రభుత్వ పాలన, నిర్ణయాలు, పథకాలతో పాటు అనేకం ప్రజలకు అందుతున్న విధానం, సరిగ్గా అమలవుతున్నాయా? లేదా?, వాటిలో ఉన్న లోపాలు ఏమిటి ? ఇలా తెలుసుకోవడానికే అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నదని విశ్లేషకులు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నాణ్యతతో ముందుకెళ్లడంలో భాగంగానే ఈ నిర్ణయంతో పార్టీ ముందుకెళ్తున్నదని నిపుణులు వివరించారు. పాలనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఉండేందుకే పార్టీ కృషి చేస్తున్నట్టు తెలిపారు.