Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పవన్ కళ్యాణ్
అమరావతి :రాష్ట్రంలో రహదారులున్నీ అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ చేస్తున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు చేయడం సిగ్గుచేటని జనసేన అధ్యక్షులు పవన్కళ్యాణ్ అన్నారు. ఆముదాల వలస సంఘటనపై పార్టీ నేతలతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పవన్ పేర్కొన్న కథనం ప్రకారం.. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిథ్యం వహిస్తున్న ఆముదాలవలసలో రోడ్ల దుస్థితిని వివరిస్తూ స్థానిక జనసేన నాయకులు పేడాడ రామోమహన్రావు ఒక ప్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై వైసిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలో సుమారు 25 మంది అధికార పార్టీకి చెందిన వాళ్లు దాడులకు తెగబడ్డారని పవన్ పేర్కొన్నారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఆయన ఫోన్లో పరమర్శించారు. దాడికి పాల్పడినవారిని శిక్షించాలని కోరారు.