Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి పౌర ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ : కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చైర్పర్సన్, విజిలెన్స్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయకపోవడంపై దేశంలోని పౌర ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ వారు ప్రధాని మోడీకి లేఖ రాశారు. వీరిలో పలువురు మాజీ జడ్జిలు, సీనియర్ లాయర్లు, మాజీ సీనియర్ పబ్లిక్ సర్వెంట్స్, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. గతేడాది అక్టోబర్లో విజిలెన్స్ కమిషనర్ రిటైర్మెంట్ అయినప్పటి నుంచి చైర్పర్సన్, ఒక కమిషనర్తోనే సీవీసీ నడుస్తున్నదని వారు లేఖలో వివరించారు. అయితే, ఆ చైర్పర్సన్ కూడా ఈ ఏడాది జూన్ నుంచి ఖాళీ కావడంతో సీవీసీ.. ఒక్క కమిషనర్తోనే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నదన్న విషయాన్ని గుర్తు చేశారు.