Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరవరరావుకు బాంబే హైకోర్టు ఆదేశం
ముంబయి : ఈ నెల 25న తలోజ సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోవాలని ప్రజాకవి వరవరరావును బాంబే హైకోర్టు ఆదేశించింది. భీమాకొరెగావ్ అల్లర్ల కేసులో నిందితుగా ఉన్న వరవరరావు ప్రస్తుతం బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్పై మార్చి 6న వరవరరావు విడుదలయ్యారు. ఆరు నెలల ఈ బెయిల్ గడువు ఈ నెల 5తో పూర్తయింది. దీంతో తన బెయిల్ గడువు పొడిగించమని వేసిన పిటీషన్ను హైకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్ షిండే, జస్టిస్ ఎన్జె జమదార్ ధర్మాసనం ముందు వరవరరావు తరుపున సీనియర్ న్యాయవాది అనంద్ గ్రోవెర్ వాదనలు వినిపించారు. యూరోలాజికల్, కొలెస్ట్రాల్, బీపీ, ప్రోస్టేట్, హృదయ సమస్యలు.. వంటి ఇతర సమస్యలతో వరవరరావు బాధపడుతున్నారని, రోజుకు 13 రకాల ట్యాబెట్లు వేసుకుంటున్నారని వివరించారు. ఈ విచారణను ఈ నెల 27కు కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 25లోగా వరవరరావు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.