Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతుల ఆందోళన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ-హర్యానా సరి హద్దు సింఘూ వద్ద రైతులు చేపట్టిన ఆందో ళనను ఖాళీ చేయించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన నిర్వాసితుల పేరుతో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సింఘూ సరిహద్దును రైతులు అనధికారికంగా మూసివేశారని, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు, జాతీయ రహదారిని ఒక వైపు అయినా తెరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణకు నిరాకరించింది. ఈ విషయాన్ని స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండే సంబంధిత హైకోర్టు విచారించాల్సి ఉందని, సుప్రీం కోర్టు కాదని ధర్మాసనం తెలిపింది.