Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఎంపి విల్సన్ వినతి
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది పి.విల్సన్ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 కు పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి విల్సన్ వినతి అందజేశారు. సుప్రీం కోర్టుకు భౌగోళికంగా దగ్గరగా ఉన్నవారికి, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి అందుబాటులో ఉందని ఈ నేపథ్యంలో ప్రాంతీయ బెంచ్‌ల ఆవశ్యకత ఉందని విల్సన్ లేఖలో పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ, పశ్చిమ తూర్పు జోన్లకు సంబంధించి ఢిల్లీ, చెన్నై, ముంబాయి, కలకత్తాలో శాశ్వతంగా ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని విల్సన్ విజ్ఞప్తి చేశారు.