Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రక్తం తాగే రాక్షసుడి ప్రభుత్వం' అంటూ యోగి సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు..
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై కేసు నమోదైంది. బీజేపీ నేత ఆకాష్ కుమార్ సక్సేనా ఫిర్యాదు ఆధారంగా మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఖురేషిపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. రాంపూర్ జిల్లా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఖురేషిపై రాజద్రోహం కేసు నమోదుచేశారు. యోగి సర్కార్‌ను 'రక్తం తాగే రాక్షసుడి ప్రభుత్వం'గా ఖురేషి అభివర్ణించారని సక్సేనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్పీ నేత ఆజంఖాన్ ఇంటికి వెళ్లి ఆయన భార్య తజీన్ ఫత్మాతో సమావేశానంతరం ఖురేషి ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ గవర్నర్ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసి సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయని సక్సేనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివిధ వార్తా ఛానెళ్లలో ప్రసారమైన ఖురేషి వ్యాఖ్యలతో కూడిన పెన్ డ్రైవ్‌ను సక్సేనా పోలీసులకు అందించారు.