Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు సోమవారం నాడు టీఎంసీ ఎంపీ, మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హజరయ్యారు. పశ్చిమ బెంగాల్లో బొగ్గు గనుల కేటాయింపుల్లో కోట్ల రూపాయిల అవినీతికి పాల్పడినట్లు అభిషేక్ బెనర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇడి అభిషేక్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని ఇడి ప్రధానకార్యాలయానికి ఉదయం 11 గంటలకు బెనర్జీ చేరుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బెనర్జీ వాంగూల్మాన్ని విచారణ అధికారి నమోదు చేశారు.
బీజేపీ నాయకుడు సువేందు అధికారికి కోల్‌కతా హైకోర్టు ఊరట కలిగించింది. అధికారిపై నమోదైన కేసుల్లో, భవిష్యత్‌లో నమోదు చేసే కేసుల్లో తమ అనుమతి లేకుండా ఎలాంటి బలవంతపు చర్యకూ పాల్పడ్డవద్దని పశ్చిమ బెంగాల్ పోలీసులను హెచ్చరించింది. అలాగే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన తరువాత అధికారిపై నమోదు చేసిన ుూడు కేసుల్లో విచారణపై స్టే ఇచ్చింది.