Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : వర్చువల్ లూనార్ సైన్స్ వర్క్‌షాప్-2021ని ఇస్రో చైర్మన్ కె.శివన్ సోమవారం ప్రారంభించారు. చంద్రయాన్-2 అంతరిక్ష నౌక చంద్రుని కక్ష్యలో రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వర్క్‌షాపును ఏర్పాటు చేశారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ పేలోడ్ల ద్వారా సేకరించిన సమాచారంతో పాటు చంద్రయాన్ డేటా ప్రోడక్ట్ అండ్ సైన్స్ పత్రాలను కూడా శివన్ ఈ సందర్భంగా విడుదల చేశారని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. అంతరిక్ష విభాగానికి (డిపార్ట్మెంట్ ఆఫ్ స్సేస్-డిఒఎస్) శివన్ కార్యదర్శిగా కూడా ఉన్నారు. చంద్రయాన్-2 నౌకలోని ఎనిమిది పేలోడ్లు రిమోట్ సెన్సింగ్, ఇన్-సీటూ టెక్నిక్‌ల ద్వారా చంద్రునిపై శాస్త్రీయపరమైన పరిశీలనలు చేస్తున్నాయని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-2 మిషన్ నుంచి మరిన్ని సైన్స్ విషయాలను బయటకు తీసుకొచ్చేందుకు ఈ డేటాను విద్యాసంస్థలు, ఇన్స్టిట్యూట్లకు అందుబాటులో ఉంచామని తెలిపింది. విద్యార్థులకు, విద్యాసంస్థలకు సమర్ధవంతంగా మరింత చేరువ చేయడంతో పాటు చంద్రయాన్-2 డేటాపై సైన్స్ సమాజం విశ్లేషణ చేసేందుకు ఇస్రో ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ లూనార్ సైన్స్ వర్క్‌షాప్‌ను ఇస్రో తన వెబ్సైట్, ఫేస్బుక్ పేజీలో లైవ్ ఇస్తోంది. ఎనిమిది పేలోడ్ల సైన్స్ ఫలితాలను శాస్త్రవేత్తలు ఈ వర్చువల్ వర్క్‌షాపులో వివరిస్తారు. అదనంగా చంద్రయాన్-2 మిషన్, సంబంధిత అంశాలపై ఉపన్యాసాలు ఉంటాయి.