Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : వైద్య విద్యలో ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా వెనుకబడినవర్గాలు) రిజర్వేషన్లు అమలుజేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా, బీడీఎస్, ఎండీఎస్ తదితర కోర్సుల్లో ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 రిజర్వేషన్లు కేటాయిస్తూ కేంద్రం ఈ ఏడాది జులై 29న ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపింది. అయితే ఈ రిజర్వేషన్ల అమలును ఆపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం, కేంద్రానికి నోటీసులు జారీచేసింది.