Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : వైద్య విద్య 2021-22 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఈ నెల 12న నిర్వహించనున్న నీట్ (యూజీ)- 2021 వాయిదా వేసే ప్రసక్తి లేదన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష వాయిదా వేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు సోమవారం జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ హషికేశ్రారు, జస్టిస్ సిటి రవి కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. సెప్టెంబరు 6న బయాలజీ, సెప్టెంబరు 9న ఫిజిక్స్ సీబీఎస్ఈ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయాలని న్యాయవాది సుమంత్ నూకల ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కొంత మంది విద్యార్థులు బహుళ పరీక్షలకు హాజరవుతున్నారనీ, బహుళ పరీక్షలకు హాజరుకావాలంటే ప్రత్యామ్నాయం ఎంచుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం చూపుతాయని ఈ నేపథ్యంలో విద్యా విషయాల్లో జోక్యం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్లు కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.