Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో అగ్రస్థానంలో నిలిచి సేవలందించిన ఢిల్లీకి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పుడు వేతనాల కోసం పోరుబాట పట్టారు. తమకు తగిన గౌరవ వేతనం, బకాయిలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ఆందోళనకు దిగారు. ఢిల్లీ సెక్రటేరియల్ ప్రాంతంలో భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆరోగ్యం, ప్రావిడెండ్ ఫండ్, సామాజిక భద్రత వంటి విషయాల్లో తమను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేతన బకాయిలను సైతం వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే, ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే వేధింపులు అడ్డుకోవాలని ఆప్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు, శిశు అభివృద్ధి శాఖ పరిధిలోని వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ఆరోగ్య వ్యవస్థలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.