Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2021 సాధారణ జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలన్న డిమాండుకు సీపీఐ(ఎం) మద్దతు పలికింది. ఈ మేరకు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కుల ప్రాతిపదికన జనాభా గణన చేయాలన్న డిమాండ్ ప్రస్తుతం మళ్లీ ముందుకు వచ్చిందని తెలిపింది. సాధారణ జనగణనలో జాబితా చేయబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మినహా ఇతర వెనుకబడిన తరగతులకు సంబంధించిన సమాచారం లేదనీ, ఇతర వెనుకబడిన తరగతుల్లోని వివిధ కేటగిరీలకు చెందిన ఖచ్చితమైన గణంకాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) ఈ సందర్భంగా స్పష్టం చేసింది.