Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పెహ్లూఖాన్ హత్యకేసులో 8మంది నిందితుల్లో ఆరుగురిపై రాజస్థాన్ హైకోర్టు బెయిల్ లభ్యమయ్యే వారెంట్‌ను జారీచేసింది. గోవుల్ని అక్రమంగా తరలిస్తున్నాడని పెహ్లూఖాన్, అతని కుమారులపై కొంతమంది అత్యంత పాశవికంగా దాడిచేయగా, దాడి అనంతరం తీవ్ర గాయాలతో పెహ్లూఖాన్ (ఏప్రిల్, 2017లో) మరణించాడు. సరైన సాక్ష్యాధారాలు లేవని ఈ దాడిలో ప్రధాన నిందితుడ్ని ఆల్వార్ కోర్టు విడుదల చేయగా, తాజాగా రాజస్థాన్ హైకోర్టు నిందితులకు బెయిలు దొరికే వారెంట్లు జారీచేయటం వార్తల్లో నిలిచింది. ఆల్వార్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పెహ్లూఖాన్ కుమారులు, రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలుచేసింది. తనను ఫలానావారు తీవ్రంగా కొట్టారని పెహ్లూఖాన్ తన మరణ వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే.