Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రైమాసికంలో ప్రజాఖర్చులపై 4.8 శాతానికి తగ్గిన కేంద్ర వ్యయం
- ప్రజలపై కేంద్రం కంటే... రాష్ట్రాలే ఎక్కువ ఖర్చు
- రాష్ట్రాలు, యూటీలకు నిధుల కోత
న్యూఢిల్లీ : ప్రజల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన వ్యయం తగ్గించింది. గతేడాదితో పోల్చితే ఈ త్రైమాసికంలో 4.8శాతానికి కేంద్రప్రభుత్వం తక్కువ వ్యయం చేసింది. లోప భూయిష్టమైన కేంద్రప్రభుత్వ వ్యయం దేశఆర్థిక పునరుద్ధరణ ను నిర్భంధించినట్టు జీడీపీ డేటా వెల్లడించింది. ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్సీఎఫ్) త్రైమాసికంలో వాస్తవానికి 4.8 శాతానికి పడిపోయిందని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది.
రాష్ట్రాలే ప్రజలపై ఎక్కువ ఖర్చు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజలపై చేసే ఖర్చును ప్రభుత్వ వ్యయం అంటాం. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన డేటా ప్రకారం జూన్ 2021 త్రైమాసికంలో 20 రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయాన్ని 17.2 శాతం పెంచినట్టు నివేదించాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం తన వ్యయాన్ని స్థిరంగా ఉంచింది. వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 4.9 శాతం తగ్గుదలను సూచిస్తుంది. 2021-22 రెండవ త్రైమాసికం కూడా ప్రభుత్వ వ్యయాల విషయంలో బలహీనత ప్రారంభమైంది. జులై 2021 కోసం ఇప్పటివరకు 17 రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్ధిక వ్యవస్థను వెల్లడించాయి. వ్యయంలో 7.6 శాతం (రూ. 1.9 ట్రిలియన్ల) ఏడాదికి వృద్ధి ఉన్నట్టు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం తన సంప్రదాయవాద విధానాన్ని కొనసాగించింది. జులై 2021లో రూ.1.8 ట్రిలియన్లు ఖర్చు చేసింది. ఇది ఏడాది క్రితం జులై నెలలో చేసిన ఖర్చు కంటే 23.3 శాతం తక్కువగా ఉంది. రెవెన్యూ, మూలధన వ్యయం రెండూ నెలల్ని పోలిస్తే..( జులై 2020తో కన్నా 2021 జులైలో) తగ్గాయి.
ప్రజల సబ్సిడీలపై తగ్గిన వ్యయం
రెవెన్యూ వ్యయం జూలై 2020 తో పోలిస్తే జులై 2021లో 22.7 శాతం (రూ.1.7 ట్రిలియన్ల) తగ్గింది. ఇందులో అయితే ప్రజలకు సంబంధించిన ప్రధాన సబ్సిడీలపై 22.2 శాతం (రూ.199.8 బిలియన్) వ్యయాన్ని తగ్గించింది. పెట్రోలియం సబ్సిడీ 98.7 శాతం (రూ.533 బిలియన్ల) తగ్గించింది.
ఆహార సబ్సిడీ 37.2 శాతం తగ్గింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) జూన్ 2021 చివరిలో ప్రభుత్వం రూ.843 బిలియన్లు అప్పుగా ఉందని పేర్కొంది. అయితే, కేంద్రం జులైలో ఆహార సబ్సిడీ కోసం కేవలం రూ.100 బిలియన్లను మాత్రమే ఇచ్చింది. బకాయిలు పేరుకుపోయేలా చేసింది.
తగ్గిన మంత్రిత్వ శాఖ వ్యయం
సెప్టెంబరు 2021 త్రైమాసికంలో వార్షిక బడ్జెట్ వ్యయంలో 20 శాతం కంటే తక్కువ వ్యయాన్ని చేయాలని ప్రభుత్వం ఆదేశించిన తరువాత, చాలా కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ ఆదాయ వ్యయాన్ని జులై 2021లో తగ్గించాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూ.25.5 బిలియన్ వద్ద రెవెన్యూ వ్యయం జూన్ 2020 కంటే 81 శాతం తక్కువగా ఉన్నది. ఉపాధి హామీ పథకం అమలు చేసే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తన వ్యయాన్ని జులై 2021లో రూ.107 బిలియన్ల (27.4 శాతం) తగ్గించింది. పెన్షన్ (సివిల్, డిఫెన్స్)పై రెవెన్యూ వ్యయం జులై 2021లో 3.8 శాతం (రూ.146 బిలియన్ల)కు తగ్గింది. 2021జులైలో కేంద్ర ప్రభుత్వం తన మూలధన వ్యయాన్ని కూడా 28.2 శాతం (రూ.169 బిలియన్ల) కు తగ్గించింది. రైల్వే మంత్రిత్వ శాఖ మూలధన వ్యయం 7.7 శాతం (రూ.28 బిలియన్ల) తగ్గింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 73.3 శాతం (రూ.15 బిలియన్ల)కు తగ్గించింది. కేంద్ర రక్షణ శాఖ 2021 జులైలో గతేడాది కంటే 15.8 శాతం (రూ.75 బిలియన్) తక్కువ వ్యయం చేసింది. అయితే పోలీసులపై రెవెన్యూ వ్యయం మాత్రం జులై 2020 కంటే, జూలై 2021 నాటికి 5.4 శాతం పెరిగింది.
రాష్ట్రాలు, యూటీలకు నిధులు తగ్గింపు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ)లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తగ్గించింది. 2020జులైతో పోలిస్తే 2021జులైలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలకు చేసే బదిలీలను 39.5 శాతం (రూ.164 బిలియన్ల)కు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 మొదటి నాలుగు నెలల్లో దాదాపు రూ.1.3 ట్రిలియన్ మూలధన వ్యయం చేసింది. ఇది వారి వార్షిక బడ్జెట్ మూలధన వ్యయంలో 23.2 శాతం. ఇది గత ఐదేండ్లలో సగటు 31.1 శాతం, పదేండ్లలో సగటు 30.1 శాతం కంటే చాలా తక్కువ. 2021 ఏప్రిల్-జులైలో రూ.8.8 ట్రిలియన్, వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 29.9 శాతం రెవెన్యూ వ్యయం చాలా తక్కువగా ఉంది.