Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వస్త్ర రంగంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకానికి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కింద అయిదేళ్ల పాటు టెక్స్టైల్స్ రంగానికి రూ.10,683 కోట్లు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వనుంది. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులకు చేయూతనిచ్చేందుకు ప్రధాని మోడీ నేతత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ ద్వారా ఈ రంగంలో 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ ఐదేళ్లలో ఈ స్కీమ్ ద్వారా రూ.3 వేల కోట్ల టర్నోవర్‌తో పాటు రూ.19 వేల కోట్లకు పైగా పెట్టుబడి లభిస్తుందని ఆశిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్లు మీడియాకు వెల్లడించారు. ఈ స్కీమ్ విధానంలో మహిళలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గోయల్ తెలిపారు.
పిఎల్ఐ స్కీమ్‌తో గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఒడిశా లాంటి రాష్ట్రాలకు ప్రయోజనం అధికమని అన్నారు. ఇతర రాష్ట్రాలూ ఈ స్కీమ్‌ను సద్వినియోగపర్చుకోవచ్చునని అన్నారు.