Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం-2019(సీఏఏ)ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం తీర్మానం చేసింది. దేశ పౌరుల మధ్య శాంతిసామరస్యాలు నెలకొల్పడానికి, రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక విలువల పరిరక్షణ కోసం 'సీఏఏ'ను రద్దు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. అసెంబ్లీలో తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''సీఏఏను 2019లో పార్లమెంట్లో ఏకపక్షంగా ఆమోదించారు. మన రాజ్యాంగం పేర్కొన్న లౌకిక భావాలకు అనుగుణంగా సీఏఏ చట్టం లేదు. భారతదేశంలో మతసామరస్యానికి సీఏఏ విఘాతం కల్పించే విధంగా ఉంది'' అని చెప్పారు. ప్రజాస్వామ్య విధానాలకు విలువనిచ్చే దేశంగా, సీఏఏ పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, దీనిని పరిగణనలోకి తీసుకొని సీఏఏను రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానంలో పేర్కొన్నారు.