Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21.02లక్షల మంది నమోదు : కేంద్రం
న్యూఢిల్లీ : దేశవ్యాప్యంగా 'ఈ-శ్రమ్ పోర్టల్' ద్వారా 21.02లక్షల మంది అసంఘటిత కార్మికుల వివరాల్ని నమోదుచేశామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ వెల్లడించింది. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా 16-59 ఏండ్ల మధ్య వయస్సు గల అసంఘటిత కార్మికుల ఆధార్ నెంబర్, కార్మికుడి పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హతలు, నైపుణ్యాలు..తదితర వివరాలు నమోదుచేస్తు న్నారు. ఈ సమాచారాన్ని సామాజిక భద్రతా పథకాల రూపకల్పన, అమల్లో వాడుకుంటామని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అసంఘటిత కార్మికులు పొందలేకపోతున్నారని, వారి వివరాల్ని నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.