Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద దేశాల ఎదురు చూపులు
న్యూఢిల్లీ : కోవిడ్ టీకాలు విషయంలో ఊహించినట్లుగానే జరిగింది. ఉత్పితి చేస్తున్న టీకాల్లో సింహభాగాన్ని ధనిక దేశాలే దక్కించుకుంటున్నాయి. దీంతో ప్రాణాలు నిలిపే ఈ టీకాలు కోసం పేదలు దేశాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఒక ఇంగ్లీష్ దినపత్రిక ఈ వివరాలను వెల్లడించింది. 'సొంతంగా కోవిడ్ టీకాల ఒప్పందాలు చేసుకే ఆర్థిక బలం లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు చేసే కోవాక్స్ సరఫరాపైనే పేద దేశాలు ఆధారపడుతున్నాయి. కోవాక్స్ సరఫరా కూడా లక్ష్యాలకు దూరంగా ఉంది' అని దినపత్రిక కథనం పేర్కొంది. ఆగస్టు 30 నాటికి ధనిక దేశాల్లో కనీసం 57 శాతం ప్రజలు కనీసం ఒక్క డోసునైనా తీసుకోగా, తక్కువ ఆదాయ దేశాల్లో ఈ శాతం 2గా ఉందనే ఐరాస గణాంకాలను దినపత్రిక తన నివేదికలో ఊటంకించింది. టీకాల పంపిణీలో ఈ అసమానత ప్రాణాంతకమైన కోవిడ్ డెల్టా వేరియంట్ల నుంచి ప్రపంచ ప్రజలను రక్షించడంలో అడ్డంకిగా మారుతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని నివేదిక తెలిపింది. టీకాల ఉత్పత్తిని పెంచడం, ధనిక దేశాల నుంచి టీకాలను తిరిగి తీసుకోవడం వంటి ప్రతిపాదనల అవసరాలను ఈ అసమానత ప్రేరిపిస్తుందని నివేదిక పేర్కొంది. 'టీకాలను అభివృద్ధి చేస్తున్న సమయంలోనే అనేక ధనిక దేశాలు వివిధ కంపెనీలతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో ప్రారంభ ఉత్పత్తి డోస్లులో సింహభాగాన్ని పొందా యి. అమెరికా టీకాల కోసం బిలియన్ డాలర్లను కేటాయించింది. టీకా తయారీదారులు ముందుగా అమెరికా ప్రభుత్వ ఆర్డర్లనే తీసుకోవడం కోసం వార్‌టైమ్ పవర్స్‌ను కూడా ప్రభుత్వం ఉపయోగించింది' అని నివేదిక తెలిపింది.