Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : త్రిపురలో సీపీఐ(ఎం), లెఫ్ట్ ఫ్రంట్‌పై బీజేపీ ఫాసిస్టు శక్తులు కొనసాగిస్తున్న హింసను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ దారుణాలను తక్షణం ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. సీపీఐ(ఎం)పై దాడులకు ముగింపు పలకాలని, త్రిపుర ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలన్న డిమాండుతో ఆందోళనలు చేపట్టాలని పొలిట్‌బ్యూరో తన అన్ని శాఖలకు పిలుపునిచ్చింది. ముందస్తు పక్కా ప్రణాళికలో భాగంగానే సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాలపై బిజెపి మూకలు దాడులకు పాల్పడ్డాయని పేర్కొంది. ఇంతటి దారుణాలకు పాల్పడుతున్నా బీజేపీ గ్యాంగులు శిక్ష నుంచి తప్పించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నట్లు స్పష్టమౌ తోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యకలాపాలను అణచివేసేందుకు అధికార బీజేపీ ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలో ఈ దాడులు జరుగు తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రతిపక్షంపై కొనసాగుతున్న దారుణమైన దాడులను ప్రజాస్వామ్య భావాలు కలిగిన పార్టీలు, వ్యక్తులు ఖండించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రకటన ద్వారా కోరింది.