Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీలోనే జంప్ జిలానీలు అధికం
- కాషాయపార్టీలో చేరిన 173 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు
- వివిధ పార్టీలకు చెందిన 253 మంది అభ్యర్థులు
- ఏడీఆర్ రిపోర్టులో స్పష్టం
న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపుదారులకు బీజేపీ అడ్డగా మారింది. 2014-21 మధ్య వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫిరాయించారు. అలాగే వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 253 మంది అభ్యర్థులు బీజేపీలో చేరారు. పార్టీ ఫిరాయింపులతో అత్యధికంగా లాభం పొందిన పార్టీగా బీజేపీ నిలిచింది. అత్యధికంగా నష్టపోయిన పార్టీగా కాంగ్రెస్ మిగిలింది. 500 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు, 1,133 మంది ఎన్నికల్లో పోటీచేసిన వారు పార్టీలు మారినట్టు అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదించింది. జంప్ జిలానీలు బీజేపీలోనే అత్యధికంగా ఉన్నారని తెలిపింది. 2014-21 మధ్య కాలంలో కాంగ్రెస్కు చెందిన 177 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అలాగే కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన 222 మంది అభ్యర్థులు పార్టీ మారారు. అలాగే బీఎస్పీకి చెందిన 153 మంది అభ్యర్థులు పార్టీ మారారు. 20 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. బీజేపీకి చెందిన 111 మంది అభ్యర్థులు, 33 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎస్పీకి చెందిన 60 మంది అభ్యర్థులు, 18 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. జేడీయుకి చెందిన 59 మంది అభ్యర్థులు, 12 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎన్సీపీకి చెందిన 52 మంది అభ్యర్థులు, 25 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. టీఎంసీకి చెందిన 31 మంది అభ్యర్థులు, 26 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారారు.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు
తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నుంచి నలుగురు అభ్యర్థులు, నలుగురు ఎంపీ, ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరారు. ఇకపోతే టీడీపీలో ఇతర పార్టీల నుంచి 11 మంది అభ్యర్థులు, 16 ఎంపీ, ఎమ్మెల్యేలు చేరారు. వైసీపీలోకి 36 మంది అభ్యర్థులు, 24 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు చేరారు. టీఆర్ఎస్లో 12 మంది ఇతన పార్టీల అభ్యర్థులు, 30 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు.
ఇక ఏపికి చెందిన పార్టీల్లో టీడీపీ నుంచి 32 మంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ మారారు. 26 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వైసీపీకి నుంచి పోటీ చేసిన ముగ్గురు పార్టీ మారారు. అలాగే 16 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు.