Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ అగ్రగామిగా నిలిచింది. రెండో స్థానంలో ఐఐఎస్సీ బెంగళూర్, మూడో స్థానంలో ఐఐటీ ఢిల్లీ నిలిచాయి. యూనివర్సిటీల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రెండోస్థానంలో నిలిచింది. ఈ మేరకు గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2021 నివేదికను విడుదల చేశారు. యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కాలేజ్, ఫార్మసీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా, డెంటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రులు అన్నపూర్ణ దేవి, సుభాస్ సర్కార్, రాజ్ కుమార్ రంజన్ సింగ్, ఉన్నత విద్యా కార్యదర్శి అమిత్ ఖారే, యూజీసీ చైర్మెన్ ప్రొఫెసర్ డిపి సింగ్, ఏఐసీటీఈ చైర్మెన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే, ఎన్బీఏ చైర్మన్ ప్రొఫెసర్ కె కె అగర్వాల్, ఎన్బీఏ సభ్య కార్యదర్శి అనిల్ కుమార్ నాస్సా తదితరులు పాల్గొన్నారు.
ఓవరల్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ విద్యా సంస్థలు
దేశవ్యాప్తంగా అత్యుత్తమ విద్యా సంస్థల ఓవరల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్ మొదటిర్యాంక్ను సొంతం చేసింది. ఐఐఎస్సీ (బెంగళూరు), ఐఐటీ ముంబయి, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కే, ఐఐటీ గువహతి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) వరసుగా మొదటి పది ర్యాంకులను సొంతం చేసుకున్నాయి.
ఐఐటీ హైదరాబాద్ 16, హెచ్‌సీయూ 17వ ర్యాంకు
ఓవరల్ ర్యాంకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యా సంస్థలు వివిధ ర్యాంకుల్లో నిలిచాయి. తెలంగాణకు చెందిన ఐఐటీ హైదరాబాద్ (16వ ర్యాంకు), హెచ్‌సీయూ (17వ ర్యాంకు), ఎన్ఐటీ వరంగల్ (59వ ర్యాంకు), ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ (62వ ర్యాంక్)లో నిలిచాయి. ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ (121వ ర్యాంకు), అనురాగ్ యూనివర్సిటీ, హైదరాబాద్ (154వ ర్యాంకు), ఇఫ్ల్యూ, హైదరాబాద్ (161వ ర్యాంకు), ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (176వ ర్యాంకు), ఎస్ఆర్ యూనివర్సిటీ, వరంగల్ (191వ ర్యాంకు), వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రంగారెడ్డి (197వ ర్యాంకు)ల్లో నిలిచాయి.
యూనివర్సిటీ విభాగం
యూనివర్సిటీ విభాగంలో ఐఐఎస్సీ (బెంగళూరు), జేఎన్‌యూ (ఢిల్లీ), బీహెచ్‌యూ (వారణాసి), కలకత్తా యూనివర్సిటీ, అమత విశ్వ విద్యాపీఠం, జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, జాదవ్‌పూర్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.
ఇంజనీరింగ్ విభాగం
ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబాయి, ఐఐటీ కాన్ఫూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రుర్కే, ఐఐటీ గువహతి, ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ తిరుచిరపల్లి, ఎన్ఐటీ కర్నాటక మొదటి పది ర్యాంకుల్లో నిలిచాయి. ఏపీకి చెందిన కెఎల్ యూనివర్సిటీ, వడ్డేశ్వరం (50వ ర్యాంకు), ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, విశాఖపట్నం (74వ ర్యాంకు)లోనూ, తెలంగాణకు ఎన్ఐటీ వరంగల్ (23వ ర్యాంకు), ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ (54వ ర్యాంకు), జేఎన్టీయు, హైదరాబాద్ (62 ర్యాంకు)లు వచ్చాయి.
మేనేజ్మెంట్ విభాగం
మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా, ఐఐఎం కోజికోడ్, ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం ఇండోర్, ఐఐఎం లక్నో, ఎక్స్ఎల్ఆర్ఐ జంషడ్‌పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ ముంబాయి మొదటి పది ర్యాంకుల్లో ఉన్నాయి. ఏపీకి చెందిన కెఎల్ యూనివర్శిటీ, వడ్డేశ్వరం (38వ ర్యాంకు), కేఆర్ఈ9ఏ, చిత్తూరు (50వ ర్యాంకు), తెలంగాణకు చెందిన ఇక్ఫారు హైదరాబాద్ (27వ ర్యాంకు), ఐఎంటీ, హైదరాబాద్ (63వ ర్యాంకు)
మెడికల్ విభాగం
మెడికల్ విభాగంలో ఎయిమ్స్ (న్యూఢిల్లీ), పీజీఐఎంఈఆర్ (చండీగఢ్), క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(వెల్లూరు), ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్ (బెంగళూరు), సంజరు గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (లక్నో), అమత విశ్వ విద్యాపీఠం (కోయంబత్తూర్), బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి), జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పుదుచ్చేరి), కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (లక్నో), కస్తూర్బా మెడికల్ కాలేజ్ (మణిపాల్) మొదటి పది ర్యాంకుల్లో ఉన్నాయి. ఏపి చెందిన నారాయణ మెడికల్ కాలేజీ, నెల్లూరు (43వ ర్యాంకు)లో నిలిచింది.