Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోతట్టు ప్రాంతాలు జలమయం
న్యూఢిల్లీ : గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు పలు చోట్లా ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది. రోడ్లు.. నదులను తలపించాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ విమానాశ్రయం జలమయమయ్యింది. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం 'తక్కువ సమయంలోనే' ఏయిర్పోర్టు ముందు భాగం నీటితో నిండిపోయిందని విమాశ్రయం అధికారులు తెలిపారు.