Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల డిమాండ్లకు అంగీకారం
- ఆయుష్ సిన్హాను సస్పెండ్ చేసేందుకు ఓకే
- న్యాయ విచారణ..కుటుంబానికి పరిహారం
- రైతుల విజయం : ఎస్కేఎం
న్యూఢిల్లీ : రైతుల ఉద్యమానికి హర్యానాలోని ఖట్టర్ ప్రభుత్వం దిగొచ్చింది. రైతుల డిమాండ్లు నెరవేర్చేందుకు అంగీకరించింది. ప్రభుత్వం తలొగ్గడంతో నాలుగు రోజుల సుదీర్ఘ రైతు ఉద్యమం శనివారం ముగిసింది. ఆగస్టు 28న రైతుల తలలు పగలగొట్టాలని ఆదేశించిన అధికారి ఆయుష్ సిన్హాను సస్పెండ్ చేయడానికి ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించింది. కర్నాల్‌లో రైతులపై జరిగిన దాడిని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ చేసేందుకు ప్రభుత్వం, రైతు నేతల మధ్య ఒప్పందం జరిగింది. పోలీసు హింసలో ఆయుష్ సిన్హా పాత్రను పరిశీలిస్తారు. రైతు మరణం, అనేకమంది గాయపడటంపై నెల రోజుల్లో విచారణ పూర్తవుతుంది. షహీద్ సుశీల్ కాజల్ కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కుటుంబ సభ్యులకు రెండు ఉద్యోగాల ఇవ్వడానికి ఓకే తెలిపింది. హింసలో గాయపడిన రైతులకు పరిహారం కూడా ఇవ్వబడుతుంది. ఈ నిర్ణయాలు స్థానిక రైతు సంఘాలతో పాటు రాష్ట్రంలోని చట్టపరమైన కార్యకర్తలను విశ్వాసంలోకి తీసుకున్నతరువాత సంప్రదించబడ్డాయి. దీనితో కర్నాల్ మినీ సెక్రటేరియట్ వద్ద ఘెరావ్ గత కొన్ని నెలలుగా హిసార్, తోహానా, సిర్సాలో మునుపటి ధర్నాల మాదిరిగానే విజయవంతమైన రీతిలో ముగిసింది.
భారీ వర్షాల్లో రైతులు ఆందోళనలు
ఢిల్లీలోని నిరంతర వర్షాలతో రైతుల శిబిరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు తెచ్చుకున్న రేషన్ నీటిలో మునిగిపోయింది. ఘాజీపూర్ మోర్చా నీట మునిగింది. అలాంటి కష్టాలను ఎదుర్కొంటూ రైతులు ఘాజీపూర్ సరిహద్దు వద్ద వరదలో ఉన్న కూర్చొని ప్రత్యేక రీతిలో నిరసన తెలిపారు.