Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గామాల్లో ప్రతీ కుటుంబంపై సగటు అప్పు రూ.59,748
- పట్టణాల్లో..రూ.1,20,336 : ఎన్ఎస్ఓ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో సగం మందికిపైగా రైతులు అప్పుల ఊబిలో ఉన్నారని, కరోనాకు ముందునాటి పరిస్థితితో పోల్చితే అప్పులపాలైన రైతు కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 50శాతానికి పైగా రైతు కుటుంబాల సగటు అప్పు రూ.74,121గా ఉందని 'నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్'(ఎన్ఎస్ఓ) వారి ఆధ్వర్యంలో చేపట్టిన 'ఆల్ ఇండియా డెట్, ఇన్వెస్ట్మెంట్ సర్వే' నివేదికలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి రైతు కుటుంబం అప్పుల్లో ఉందని, వారి కుటుంబాలపై సగటు అప్పు 59,748గా ఉందని, పట్టణ ప్రాంతాల్లోన్ని రైతు కుటుంబాలపై సగటు అప్పు రూ.1,20,336 ఉందని నివేదిక తెలిపింది. జనవరి 2019-డిసెంబర్ 2019 మధ్యకాలంలో జరిగిన సర్వే ఆధారంగా ఈ గణాంకాల్ని రూపొందించినట్టుగా ఎన్ఎస్ఓ తెలిపింది. ఈ సర్వేలో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి... దేశంలో 50శాతానికిపైగా రైతు కుటుంబాల సగటు అప్పు రూ.74,121గా ఉంది. వీరు తీసుకున్న రుణాల్లో 69.6శాతం బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతా ల్లోని రుణాల్లో 87శాతం క్రెడిట్ ఏజెన్సీలు, 13శాతం ప్రయివేటు సంస్థలు అందజేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో 50శాతానికిపైగా వ్యవసాయ కుటుంబాలపై సగటు అప్పు రూ.74,460ఉండగా, వ్యవసాయేతర కుటుంబాలపై సగటు అప్పు 40,432 ఉంది. పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కలిగిన కుటుం బాలపై సగటు అప్పు రూ.1,79,765, ఇతర కుటుంబాలపై సగటు అప్పు రూ.99,353 ఉందని సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 5940 గ్రామాల్లోని 69,455 కుటుంబాల నుంచి సేకరించిన సమాచారంతో ఈ సర్వే గణాంకాలు రూపొందించినట్టు ఎన్ఎస్ఓ తెలిపింది.