Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీ
న్యూఢిల్లీ : నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ఇన్కం ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)లలో ఖాళీల భర్తీకి సంబంధించి కేంద్రంలో కదలిక వచ్చింది. ఎట్టకేలకు వాటిని భర్తీ చేసింది. ఎన్సీఎల్టీలో జ్యుడీషియల్, టెక్నికల్.. ఐటీఏటీలో జ్యుడీషియల్, అకౌంటెంట్ విభాగాల్లో 31 మంది సభ్యులను నియమించింది. ఆయా ట్రిబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 6న అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13వ తేదీలోగా తమ తీరు మార్చుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నియామకాలు చేపట్టింది.