Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగాల విషయంలో విఫలమవుతున్న కేంద్రం తీరుపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం చేశారు. దేశంలో ఉద్యోగాలు లేనందున సెలవు దినానికి, పని దినానికి మధ్య తేడా లేకుండా పోయిందని వివరించారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా రిపోర్ట్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు చేశారు. '' ఆది, సోమవారాలకు మధ్య తేడాకు ఫుల్స్టాప్ పడింది. బీజేపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి ఇదే '' అని ఆయన పేర్కొన్నారు. అసలు దేశంలో ఉద్యోగాలే లేనప్పుడు అది ఆదివారమా లేక సోమవారమా అన్నది విషయమే కాదని వ్యంగ్యంగా వివరించారు.