Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పేరే పునరుద్ధరణ
మంగళూరు : మంగళూరు ఏయిర్పోర్టు పేరు మార్పు విషయంలో నెలల పాటుగా నిరసనలు చేస్తున్న స్థానిక సామాజిక కార్యకర్తల కృషి ఫలించింది.ఫలితంగా మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏ)పేరు బోర్డుల నుంచి'అదానీ ఏయిర్‌పోర్ట్స్' ట్యాగ్ తొలగిపోయి ంది.ఆ స్థానంలో.. ఏయిర్‌పోర్టును అదానీ గ్రూపు టేకోవర్ చేయకముందు ఉన్న అసలైన నేమ్ బోర్డ్స్ తిరిగి వచ్చి చేరాయి. ఏయిర్పోర్టు పేరు మార్పు విషయంలో పోరాటానికి చొరవ తీసుకున్న సామాజిక కార్యకర్త దిల్‌రాజ్ అల్వా ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. ఈ ఏయిర్‌పోర్టును టేకోవర్ చేసిన తర్వాత అదానీ గ్రూపు విమానాశ్రయ బోర్డులకు ' అదానీ ఏయిర్‌పోర్ట్స్'ను చేర్చిందని తెలిపారు. ఏయిర్పోర్టు పేరు మార్పుపై ఎలాంటి నిబంధనా లేనప్పటికీ అదానీ గ్రూపు ఈ విధంగా వ్యవహరించిన తీరు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో ఈ ఏడాది మార్చిలో ఏయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎంఐఏ డైరెక్టర్‌కు లీగల్ నోటీసులు అందాయి. ఒక పక్క న్యాయపరంగా పోరాటం జరుగుతున్న క్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకున్నది. ఎంఐఏ అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లోనూ పేర్లు మారాయి.