Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో విద్యార్థి ఆత్మహత్య
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ 2021 అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 13 భాషల్లో 202 నగరాల్లో నిర్వహించిన సుమారు 16 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. దేశ, విదేశాల్లో కలిపి 3858 పరీక్షా కేంద్రాల్లో కోవిడ్- ఆర్యోగ సంరక్షణ మార్గదర్శకాల ప్రకారం ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించింది. ఈ ఫలితాలతో దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్, బిడిఎస్ కాలేజీల్లో ప్రవేశం కల్పిస్తారు. నీట్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పరీక్ష శనివారం నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో తమిళనాడులోని సెలాం జిల్లాకు చెందిన విద్యార్థి ధనుష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని తండ్రి వ్యవసాయ కార్మికుడు. ధనుష్ ఆత్మహత్యతో పరీక్ష ముగిసిన 30 నిమిషాల లోపునుంచే ఈ పరీక్ష నిషేధించాలని సోషల్ మీడియాలో డిమాండ్ ఊపందుకుంది. విద్యార్థులు ఆశ కోల్పోవద్దని,ఈ బిల్లుకు వ్యతిరేకంగా రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తెలిపారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు.